రేవంత్‌వి అన్నీ తుపాకీ రాముని ముచ్చట్లే: హరీశ్​రావు

రేవంత్‌వి అన్నీ తుపాకీ రాముని ముచ్చట్లే: హరీశ్​రావు
  • కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
  •  కాకతీయ తోరణం ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక
  •  ఉద్దర మాటలు తప్ప కాంగ్రెస్​ఉద్ధరించేది లేదు


హనుమకొండ: కాక‌తీయ తోర‌ణాన్ని ముట్టుకుంటే వ‌రంగ‌ల్ జిల్లా అగ్నిగుండం అవుతుంద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు వార్నింగ్​ఇచ్చారు. ఉద్దర మాటలు తప్ప కాంగ్రెస్​ఉద్ధరించేది  లేదన్నారు. హనుమకొండ జిల్లా చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో జరిగిన వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో హరీశ్​మాట్లాడారు. ‘సీఎం రేవంత్ తెలంగాణ చిహ్నంలోని కాక‌తీయ తోర‌ణం తీసేస్తా అంటున్నడు. అదే జరిగితే వరంగల్ అగ్ని గుండం ఐతది. కాకతీయ తోరణం ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. దాన్ని తొలగిస్తే హస్తం పార్టీ నామరూపాల్లేకుండా పోతది.

ALSO READ :- కరువుతో రైతు నష్టపోతే కేసీఆర్ రూపాయి ఇవ్వలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పాలనలో లీకు, ఫేక్ వార్తలే తప్ప ఏమీ లేదు. 100 రోజుల్లో ఆరు గ్యారెటీలు అమలు చేస్తమన్నారు. ఏం చేశారు? రేవంత్ వి అన్నీ తుపాకీ రాముని ముచ్చట్లే. కడియం వెళ్లిన తర్వాత పార్టీ లో జోష్ కనిపిస్తోంది. పార్టీకి ద్రోహం చేసిన ఆయన్ను ఓడగొట్టాలని కసి కనపడుతోంది. ఇంత దిగజారడం అవసరమా అని శ్రీహరి ఆలోచించాలి. నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్​చేశారు.