ఉద్యాన పంటలతో లాభాలు

ఉద్యాన పంటలతో లాభాలు

గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటలు రైతులకు లాభసాటిగా ఉండేలా  హార్టికల్చర్​ యూనివర్సిటీ అధికారులు కృషి చేయాలని ఫైనాన్స్​ మినిస్టర్​  తన్నీరు హరీశ్​రావు సూచించారు. స్టడీస్​తో పాటు రీసర్చీ, ఎక్స్​టెన్షన్​ల మీద దృష్టి పెట్టాలన్నారు. గురువారం  ఆయన సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్​ హార్టికల్చర్​ యూనివర్సిటీ యానివర్సరీ వేడుకల్లో పాల్గొన్నారు. వర్సిటీ లోగోను రిలీజ్​చేసి, వివిధ స్టాళ్లను పరిశీలించారు.  ఆదర్శరైతు పద్మశ్రీ  చింతల వెంకట్​రెడ్డిని సన్మానించారు.  రైతులను ఆయిల్​పామ్​, నూనెగింజలు, పండ్లు, కూరగాయల సాగు వైపు ప్రోత్సహించాలన్నారు. యూనివర్సిటీ అవసరాలకోసం మరో 140 ఎకరాలు సేకరించి ఇస్తామని చెప్పారు. స్టూడెంట్స్​ ఫీల్డ్  విజిట్​ చేస్తూ తోటల పెంపకంలో కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకోవాలన్నారు. యునివర్సిటీకి సంబంధించి ఫండ్స్​, పోస్టుల భర్తీ, తదితర సమస్యలపై సీఎంతో మాట్లాడి  పరిష్కరిస్తానన్నారు. వ్యవసాయం మీద  సీఎం కేసీఆర్​కు అవగాహన, ఆసక్తి ఎక్కువని, దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్ లో ఏకంగా 13.5 శాతం ఫండ్స్​ వ్యవసాయంమీద ఖర్చుచేస్తున్నామన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేండ్లలో  పూర్తి చేశామన్నారు.  రైతు బంధు కింద ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లు రైతులకు అందించామని, డిసెంబర్ 28 నుంచి 7,500 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్​ ప్రతాప్​రెడ్డి, జెడ్పీ చైర్​పర్సన్​ రోజాశర్మ, అడిషనల్​ కలెక్టర్​ ముజమిల్​ఖాన్​, యూనివర్సిటీ వైస్​చాన్సలర్​ డాక్టర్​ నీరజా ప్రభాకర్​ పాల్గొన్నారు. 

ఆయిల్‌పామ్​తో మేలు  
సిద్ధిపేట రూరల్, వెలుగు : ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు మంచి లాభాలుంటాయని,  రైతులకు ఈ మొక్కలను పంపిణీ చేయాలని అగ్రికల్చర్​, హార్టికల్చర్​ఆఫీసర్లకు  మంత్రి హరీశ్ రావు సూచించారు. గురువారం ములుగు హార్టికల్చర్ గెస్ట్ హౌస్ నుంచి ఆయన అధికారులతో  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1,100 ఎకరాలకు సరిపడే ఆయిల్​పామ్​ మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్​వచ్చినవారికి ప్రియారిటీ ఇవ్వాలన్నారు.