పవన్ కళ్యాణ్ ఫ్యాన్కు కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్కు కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్( Pawan kalyan)​, హరీష్ శంకర్(Harish Shankar.S) కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తయింది. రీసెంట్ గా మాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ క్వాలిటీ విషయంలో ఓ నెటీజ‌న్ చేసిన కామెంట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

నెటీజ‌న్ ఏమ‌ని ట్వీట్ చేశాడంటే..అప్పుడే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్త‌యింద‌ట క‌దా అన్నా.. ఇక క్వాలిటీ ఆ దేవుడి మీదే భారం వేశాం.’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై హ‌రీశ్ శంక‌ర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తూ.. ‘అంతే క‌దా త‌మ్ముడు. అంత‌కు మించి నువ్వేం చేయ‌గ‌ల‌వు చెప్పు..? ఈ లోగా కాస్త కెరీర్‌, జాబ్‌, స్ట‌డీస్ మీద ఫోక‌స్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వ‌దిలేయ‌కు. ఆల్ ది బెస్ట్.’ అంటూ రిప్లై ఇచ్చాడు.

శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం..ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తో పాటు  ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఓజీ చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా క్రిష్ డైరెక్ష‌న్ లో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు తెర‌కెక్కుతోంది.