
సిద్దిపేట: రైతులు రసాయనిక ఎరువులు వాడడం తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులతో పాటు ప్రతి ఒక్కరు మొక్కలను నాటి భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలన్నారు. లేదంటే వాతావరణంలో మార్పులు వచ్చి రానున్న రోజుల్లో భూమి ఒక అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు . 97 శాతం భూ ప్రక్షాళణ పూర్తయిందన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో 59640 మందికి కొత్త పాస్ బుక్కులు అందజేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతతో పాలన కొనసాగించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. త్వరలో ప్రతి మండలంలో రెవెన్యూ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అందుబాటులోకి రాబోతున్నాయని అన్నారు హరీష్.