ENG vs IND: నిర్లక్ష్యమా..? దురదృష్టమా..? చేజేతులా వికెట్ పోగొట్టుకున్న డియోల్

ENG vs IND: నిర్లక్ష్యమా..? దురదృష్టమా..? చేజేతులా వికెట్ పోగొట్టుకున్న డియోల్

ఇంగ్లాండ్ మహిళలతో బుధవారం (జూలై 16) జరిగిన తొలి వన్దేలో టీమిండియా మహిళలు ఘన విజయం సాధించారు. పెద్దగా పోటీ లేకుండా ముగిసిన ఈ మ్యాచ్ లో మన జట్టు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భారత మహిళల జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఊహించని సంఘటన ఒకటి సోషల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్లీన్ డియోల్ విచిత్ర రీతిలో రనౌట్ అయింది. 

ఇంగ్లాండ్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేజింగ్ దిశగా దూసుకెళ్తూ ఉంది. 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినప్పుడు డియోల్ క్రీజులోకి వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేస్తుంది. ఈ సమయంలో ఊహించని షాక్ తగిలింది. చార్లీ డీన్ వేసిన ఇన్నింగ్స్ 22 ఓవర్లో డియోల్ మిడ్ ఆన్ దిశగా షాట్ ఆడి క్విక్ సింగిల్ తిరగడానికి ప్రయత్నించింది. మిడ్ ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ నా స్ట్రైకింగ్ వైపు డైరెక్ట్ గా త్రో విసిరింది. 

ALSO READ : Mohammed Shami: నా డార్లింగ్ డాటర్: కూతురు పుట్టినరోజు మహమ్మద్ షమీ ఎమోషనల్ మెసేజ్

అప్పటికే క్రీజ్ లోకి వచ్చానని హర్లీన్ భావించింది. అయితే రీప్లేలో ఔట్ అని తేలింది. డియోల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ రనౌట్ అయినట్టు తెలుస్తుంది. ముందుగా క్రీజ్ లో బ్యాట్ పెట్టకుండా త్రో వేసే సమయానికి గాల్లోకి ఎగిరింది. దీంతో దురదృష్టవశాత్తు ఔట్ కావాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో 44 బంతుల్లో 27 పరుగుల వద్ద డియోల్ ఔటైంది. 102 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయినా జెమీమా రోడ్రిగ్స్ (48), దీప్తి శర్మ (62) భారీ భాగస్వామ్యంతో ఇండియా గెలిచింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  సోఫియా డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 259 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి గెలిచింది. దీప్తి శర్మ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమిమా రోడ్రిగ్స్ 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది.