
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన కూతురు ఐరా పుట్టినరోజుకు హృదయపూర్వకమైన విషెస్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ 34 ఏళ్ల సీమర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు చిత్రాలను పోస్ట్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. "డార్లింగ్, డాటర్ మనం కలిసిన ఉన్న క్షణాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. నువ్వు ఇంత త్వరగా పెరుగుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. జీవితంలో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ రోజు, ఎల్లప్పుడూ నీకు ప్రేమ, శాంతి, ఆనందం, మంచి ఆరోగ్యాన్ని సమృద్ధిగా ఇచ్చి దీవించాలి". అని షమీ ఇంస్టాగ్రామ్ ద్వారా తన కూతురు పుట్టిన రోజు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేసుకున్నాడు.
Indian pacer Mohammed Shami showers love on his daughter with a touching birthday post! 💖🎈 pic.twitter.com/JCm86mDPR3
— CricketGully (@thecricketgully) July 17, 2025
2014లో షమీ, హసీనా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఐరా జన్మించింది. అయితే వివిధ కారణాలతో 2018లో షమీ, హసీనా విడిపోయారు. షమీ, హసీన్ జహాన్ కు 2018లో విడిపోయారు. తన భర్త షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో షమీపై కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు వరకట్నం వేధింపులు, గృహ హింస చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
అదే సమయంలో తమ ఖర్చుల కోసం నెలకు రూ.10 లక్షలు భరణం ఇచ్చేలా ఆదేశించాలంటూ హసీన్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో రూ. 7లక్షలు తన ఖర్చుల కోసం కాగా మిగిలిన రూ.3 లక్షలు కూతురు మెయింటెనెన్స్ కోసమని పిటిషన్ లో పేర్కొంది. ట్రైయల్ కోర్టు ఆర్డర్ ను సమీక్షించిన హైకోర్టు.. భరణం నెలకు రూ.4 లక్షలు చెల్లించాల్సింది ఆదేశించడం గమనార్హం. అదే విధంగా ఈ కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాల్సిందిగా దిగువ కోర్టును ఆదేశించింది.
Also Read:-టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత.. ఒక్క నో బాల్ వేయకుండా 34,504 డెలివరీస్
ప్రస్తుతం షమీ గాయంతో టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2025 లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ టోర్నీ ఆడుతుండగానే షమీ గాయపడ్డాడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ కు షమీ దూరమయ్యాడు. భారత జట్టు తరపున చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ ఆడాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు షమీ 64 టెస్టుల్లో 229 వికెట్లు.. 108 వన్డేల్లో 206 వికెట్లు తీశాడు. 25 టీ20 లు ఆడగా.. 27 వికెట్లు తీశాడు.