హరోం హర మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

హరోం హర మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’.  సుబ్రహ్మణ్యం, సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది అతిథులుగా హాజరై ట్రైలర్ టెర్రిఫిక్‌‌‌‌‌‌‌‌గా ఉందని చెప్పారు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘కృష్ణ గారి జయంతి సందర్భంగా ట్రైలర్ లాంచ్ కావడం ఆనందంగా ఉంది. 

ఈ సినిమా  నాకు చాలా స్పెషల్. యూనిక్ కాన్సెప్ట్.  ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మూవీ రాలేదనుకుంటున్నా. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. డైరెక్టర్ జ్ఞానసాగర్ మాట్లాడుతూ ‘ఇందులో  సుధీర్ బాబు మాస్ సంభవం చూడబోతున్నారు. రెండు వేల మందితో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రం అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుందని నిర్మాతలు అన్నారు.