టీ20 వరల్డ్ కప్ కు హర్ష భోగ్లే టీమ్

V6 Velugu Posted on Jul 31, 2021

టీ20 ప్రపంచ కప్‌ ఆరంభానికి ఇంకా మూడు నెలల టైమ్ ఉంది. కానీ క్రికెట్‌ అభిమానుల్లో ఇప్పటికే ఈ టోర్నీ గురించి రకరకాల ఊహాగానాలు, వదంతులు హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. భారత జట్టు కూర్పు అంచనాలకు అందడం లేదు. ఐపీఎల్ లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారో.. లేక తాజాగా జరిగే వన్డే మ్యాచులను పరిగణలోకి తీసుకుంటారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తుది జట్టును ఎంపిక చేయడం బీసీసీఐ సెలెక్టర్లకు తలకు మించిన వ్యవహారంలా మారుతోంది. ఎవరిని తప్పించినా.. వారి ఐపీఎల్ ప్రతిభను చూసి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలకు దిగుతున్న నేపధ్యంలో సెలెక్టర్లపై ఒత్తిడి పెంచుతోంది.  
ఈక్రమంలో టీ20 వరల్డ్‌ కప్‌కు తనకు ఇష్టమైన క్రికెట్‌ జట్టును ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్ష భోగ్లే ప్రకటించారు. తనదైన అంచనాలతో ఈయన ప్రకటించిన తుది జట్టు గురించి చర్చ జరుగుతోంది. విచిత్రంగా ఈయన టీమ్‌లో శిఖర్‌ ధవన్‌, కుల్దీప్‌ యాదవ్‌ కు చోటు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది హర్ష భోగ్లే రెడీ చేసిన టీమ్‌... 
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ /టి. నటరాజన్, యుజ్వేంద్ర చాహల్.

Tagged , t20 worldcup, india dream team, india team for t20, cricket updates, cricket latest updates, commentator Harsha Bhogle team

Latest Videos

Subscribe Now

More News