హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా మోడీని కుదిపేసింది: సుఖ్బీర్‌ బాదల్‌

హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా మోడీని కుదిపేసింది: సుఖ్బీర్‌ బాదల్‌

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుదిపివేసిందన్నారు శిరోమణి అకాలీదళ్‌ (SAD) నేత సుఖ్బీర్‌  బాదల్‌. వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్ లోని  ముక్త్సర్‌లో శుక్రవారం ర్యాలీ జరిగింది. ర్యాలీలో మాట్లాడిన బాదల్‌ … గత రెండు నెలలుగా రైతుల గురించి ఎవరూ మాట్లాడలేదని… హర్‌సిమ్రత్‌ రాజీనామాతో రోజూ ఐదుగురు మంత్రులు ఈ అంశంపై మాట్లాడుతున్నారని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణు బాంబుతో జపాన్‌ను కుదిపివేస్తే అకాలీదళ్‌ వేసిన ఒక బాంబుతో మోడీ ప్రభుత్వం వణికిపోతోందన్నారు.

వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లో SAD  ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఈ బిల్లులను అడ్డుకోవాలని SAD  ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించింది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎంపీ, సుఖ్బీర్‌ బాదల్‌ సతీమణి హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.