హర్యానా మాజీ సీఎంకు కారు ప్రమాదం.. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు

హర్యానా మాజీ సీఎంకు కారు ప్రమాదం.. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భుపిందర్ సింగ్ హుడాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ నీలుగాయి(మనుబోతు) కారుకు అడ్డం రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ధాటికి ముందు సీటులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో భారీ నష్టం తప్పింది. 

ఈ ఘటనలో ఆయనతో పాటుగా కారులో ప్రయాణిస్తున్న కొందరికి స్పల్ప గాయాలయ్యాయి. హర్యానాలోని హిసర్ జిల్లాలో బార్వాలా అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ‘దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాల వల్ల నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ భుపిందర్ సింగ్  ట్వీట్ చేశారు. మరో వాహనంలో ఆయనను తరలించడంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.