
హైదరాబాద్, వెలుగు: బీసీల అభివృద్ధికి తన వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీల సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
శనివారం చండీగఢ్‌లోని రాజ్ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ సంఘాల నేతలు గవర్నర్‌ను కలిశారు. జాజుల మాట్లాడుతూ.. రాజకీయాల్లో అజాత శత్రువు దత్తాత్రేయ అని, ఆలయ్ బలయ్‌తో తెలుగు ప్రజలను ఏకం చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కుందరం గణేశాచారి, బాలరాజు గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్‌తో తదితరులు ఉన్నారు.