ఒమిక్రాన్ ఎఫెక్ట్: మరో రాష్ట్రంలో థియేటర్ల మూసివేత

ఒమిక్రాన్ ఎఫెక్ట్: మరో రాష్ట్రంలో థియేటర్ల మూసివేత

కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు స్కూళ్లు, థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా హర్యానా సర్కారు ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించింది. గుర్గావ్, ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్ జిల్లాల్లో జనవరి 2 నుంచి 12 వరకు పది రోజుల పాటు కొత్త రిస్ట్రిక్షన్స్ అమలులో ఉంటాయని తెలిపింది. ఈ ఐదు జిల్లాల్లో స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశించింది హర్యానా ప్రభుత్వం. అలాగే మాల్స్, మార్కెట్లలోకి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పబ్లిక్‌ను అనుమతించాలని సూచించింది. బార్లు, రెస్టారెంట్లలోకి 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే వర్క్ చేయాలని పేర్కొంది. ఎమర్జెన్సీ, నిత్యావసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50 శాతం స్టాఫ్‌తోనే నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే హర్యానా రాష్ట్రమంతా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కాగా, హర్యానాలో శుక్రవారం ఒక్క రోజే 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 63కి చేరింది. 

మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు, థియేటర్లను పూర్తి మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది కేజ్రీ సర్కారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు థియేటర్లు, రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. తెలంగాణలోనూ ర్యాలీలు, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సాంస్కృతిక ఉత్సవాలకు అనుమతులు లేవని ఆదేశించింది ప్రభుత్వం. షాపింగ్‌‌‌‌‌‌‌‌ మాల్స్, దుకాణాలు, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో సోషల్‌‌‌‌‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ కంపల్సరీగా పాటించాలని పేర్కొంది.