
- వైరస్ నుంచి కోలుకున్న తబ్లిగి జమాత్ సభ్యుడు అర్షద్
చండీగఢ్: వైరస్ బారిన పడి కోలుకున్న తబ్లిగి జమాత్ సభ్యుడు రెండు సార్లు ప్లాస్మా డొనేట్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అర్షద్ అహ్మద్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. తబ్లిగి కార్యక్రమం నుంచి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో హర్యానాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొంది కోలుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన అర్షద్ అవసరమైతే ఇంకా 10 సార్లయినా డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని శనివారం మీడియాతో చెప్పారు.
రంజాన్ మాసం కావడంతో ముస్లింలు ఇండ్లలోనే ప్రార్థనలు చేయాలని, ఎవరూ మసీదులను సందర్శించవద్దని అర్షద్ సూచించారు. ‘‘ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. డాక్టర్లకు, అధికారులకు సహకరించాలి. కరోనా సింప్టమ్స్ ఉన్నవారు తప్పనిసరిగా హెల్త్ సిబ్బందికి సహకరించాలి. కరోనా పేషెంట్ల చికిత్స్ కోసం ఇప్పటికే రెండు సార్లు ప్లాస్మా డొనేట్ చేశాను. అవసరం ఉంటే పదిసార్లయినా దానం చేస్తాను”అని అన్నారు.