ఒక్క అధికారైనా అరెస్టయ్యారా?

ఒక్క అధికారైనా అరెస్టయ్యారా?
  • ఢిల్లీ మున్సిపల్ ​కార్పొరేషన్‌‌‌‌ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బిల్డింగ్​  సెల్లార్​లోకి వరదతో  ముగ్గురు సివిల్స్​ అభ్యర్థులు మృతిచెందిన ఘటనలో మున్సిపల్​ అధికారులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)నుంచి ఒక్కరైనా అరెస్టయ్యారా? అని ప్రశ్నించింది.  విద్యార్థుల మరణాలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై బుధవారం విచారణ చేపట్టింది.

 ఉన్నతాధికారుల తీరును తప్పుపట్టింది.  ఉచితాలను ప్రోత్సహిస్తూ.. ట్యాక్స్​లు వసూలు చేయకుండా మల్టీస్టోర్​ బిల్డింగ్స్​కు అనుమతించి డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని వ్యాఖ్యానించింది. పట్టణ నిర్వహణ  ప్రణాళికపై సమాధానమివ్వాలని ఎంసీడీ డైరెక్టర్​కు సమన్లు జారీ చేసింది. మరోవైపు, నిర్లక్ష్యంగా కారు నడిపి.. కోచింగ్​ సెంటర్​ సెల్లార్​లోకి వరద నీరు వచ్చేందుకు కారణమయ్యాడనే ఆరోపణలపై అరెస్టయిన ఎస్​యూవీ డ్రైవర్​ మనూజ్​కథూరియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్​ నిరాకరించింది. కోచింగ్​ సెంటర్​ కోఓనర్స్​కు కూడా కోర్టు బెయిల్​ తిరస్కరించింది.