దుండిగల్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రూ.9 లక్షల హాష్ ఆయిల్‌ను దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. యూపీకి చెందిన అస్రాని సునీల్ కుమార్ (34), చింతల్‌కు చెందిన కట్టా చింటూ (27), సూర్యకాంత్ (26) కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశాకు చెందిన సాధురామ్ వద్ద సుమారు రూ.9 లక్షల విలువైన 1.3 కిలోల హాష్ ఆయిల్ కొనుగోలు చేశారు.
అనంతరం సిటీలోని డి. పోచంపల్లికి తరలించి పలువురికి విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి హాష్ ఆయిల్‌తో పాటు మూడు మొబైల్ ఫోన్లు, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సాధురామ్ కోసం గాలిస్తున్నారు.
