Hashim Amla: ఆమ్లా ఆల్‌టైం బెస్ట్ బ్యాటర్స్ వీరే.. ఆరుగురిలోనూ సచిన్ పేరు లేదు

Hashim Amla: ఆమ్లా ఆల్‌టైం బెస్ట్ బ్యాటర్స్ వీరే.. ఆరుగురిలోనూ సచిన్ పేరు లేదు

సౌతాఫ్రికా వెటరన్​ బ్యాట్స్‌‌మన్‌‌ హషీమ్‌‌ ఆమ్లా ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఆరు సంవత్సరాలు అయింది. ఫార్మాట్ ఏదైనా నిలకడకు మారు పేరుగా నిలిచాడు. ఫార్మాట్ కు తగ్గట్టు టెక్నీక్ మార్చుకొని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ 18000  పైగా పరుగులు చేసిన ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్.. ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఆడుతున్నాడు. శనివారం ( జూలై 19) వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆడిన ఆమ్లా..18 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అతను తదుపరి మ్యాచ్‌లో జూలై 22న నార్తాంప్టన్‌లో ఇండియా ఛాంపియన్స్‌తో ఆడనున్నాడు. 

వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ కోసం షెఫాలి బగ్గాతో జరిగిన సంభాషణలో ఆమ్లాను వరల్డ్ లో ముగ్గురు బెస్ట్ బ్యాటర్లను ఎంచుకోవాలని అడిగారు. ఆమ్లా మాట్లాడుతూ ఇది చాలా కష్టమైందని చెప్పాడు. చాలా సంవత్సరాలుగా నేను ఆరాధించే గొప్ప వ్యక్తుల్లో బ్రియాన్ లారా, స్టీవ్ వా, జాక్వెస్ కలిస్ నా ఫేవరేట్స్. వీరు ముగ్గురు కాకుండా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, లెజెండరీ సర్ వివియన్ రిచర్డ్స్‌లను కూడా ప్రముఖ పేర్లుగా చెప్పుకొచ్చాడు. ఆమ్లా చెప్పిన పేర్లలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. 

42 ఏళ్ల ఆమ్లా 15 ఏళ్ల ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌లో అన్ని ఫార్మాట్‌‌ల్లో కలిపి349 మ్యాచ్‌‌లాడి 18000 పైచిలుకు పరుగులు చేశాడు.  ఇందులో 55 సెంచరీలు, 88 హాఫ్‌‌ సెంచరీలు ఉన్నాయి. 181 వన్డేల్లో 8113 పరుగులు చేశాడు. వీటిలో  27 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. 124 టెస్టులు ఆడిన ఆమ్లా 9282 పరుగులు చేశాడు. ఇందులో  28 సెంచరీలుండగా, 41 హాఫ్ సెంచరీలున్నాయి. సౌతాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడు హషీమ్ ఆమ్లా నిలిచాడు. ముందుగా జాక్వెస్ కలిస్ ఉన్నాడు. 2012లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌పై ఆమ్లా చేసిన 311పరుగులు అతని కెరీర్ లో అత్యుత్తమమైనది.  ఇక 44 టీ20ల్లో ఆమ్లా 8 హాఫ్ సెంచరీలతో 1277 రన్స్ చేశాడు. 

ALSO READ : R Ashwin: మనం మనుషులం.. అసూయ కలగడం సహజం: హర్భజన్ సింగ్ సూటి ప్రశ్నకు అశ్విన్ రిప్లై