R Ashwin: మనం మనుషులం.. అసూయ కలగడం సహజం: హర్భజన్ సింగ్ సూటి ప్రశ్నకు అశ్విన్ రిప్లై

R Ashwin: మనం మనుషులం.. అసూయ కలగడం సహజం: హర్భజన్ సింగ్ సూటి ప్రశ్నకు అశ్విన్ రిప్లై

స్పిన్ దిగ్గజాలు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేశారు. ముఖ్యంగా టెస్టుల్లో వీరు టీమిండియాకు వెన్నుముకల నిలిచారు. అనీల్ కుంబ్లే తర్వాత గొప్ప స్పిన్నర్లుగా నిలిచారు. హర్భజన్ 103 టెస్టులు ఆడి 32.46 సగటుతో 417 వికెట్లు పడగొట్టాడు. వీటిలో 25 ఐదు వికెట్లు.. ఐదు సార్లు టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ లో పది వికెట్ల ఘనతలు ఉన్నాయి. మరోవైపు అశ్విన్ 106 టెస్టుల్లో 24 యావరేజ్ తో 537 వికెట్లు పడగొట్టాడు. వీటిలో 37 సార్లు ఐదు వికెట్లు.. ఎనిమిది సార్లు పది వికెట్ల ఘనతలు ఉన్నాయి. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 

అశ్విన్, హర్భజన్ సింగ్ తమ మధ్య గతంలో విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హర్భజన్ సింగ్ కు కాంపిటీషన్ గా మారాడు. అశ్విన్ అద్భుత బౌలింగ్ కారణంగానేహర్భజన్ కు భారత జట్టులో స్థానం పోయిందనే పుకార్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న విబేధాల గురించి వస్తున్న పుకార్ల గురించి ఎట్టకేలకు మౌనం వీడారు. ఆష్‌తో కలిసి కుట్టి స్టోరీస్ సీజన్ 3 కోసం విడుదల చేసిన టీజర్‌లో అశ్విన్, హర్భజన్ ఇద్దరూ కలిసి తమపై వచ్చిన ఊహాగానాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా హర్భజన్ బహిరంగంగా అడిగిన ఒక ప్రశ్న వైరల్ గా మారుతోంది. 

హర్భజన్ మాట్లాడుతూ.. "నేను నిన్ను చూసి అసూయపడుతున్నానని నువ్వు నమ్ముతావా? నువ్వు ఈరోజు నాతో ఇక్కడ ఉన్నావు. మనం చాలాసేపు మాట్లాడాము. నేను అలా భావించే వ్యక్తినని నువ్వు నిజంగా అనుకుంటున్నావా?" అని అడిగాడు. దానికి అశ్విన్ సానుకూలంగా  స్పందించాడు. " మీరు ఎప్పుడైనా అసూయపడినా, అందులో అర్ధం ఉంది. ఇది మనం అర్ధం చేసుకోవాలి. అదే నా ఉద్దేశ్యం. నేను దానిని ఎప్పుడూ ప్రతికూలంగా తీసుకోను. ఎందుకంటే మనమందరం మనుషులమే. అలాంటి భావాలు తలెత్తడం సహజం." అని అశ్విన్ బదులిచ్చాడు. 

ALSO READ : Andre Russell: ఇండియాపై సిక్సర్ కొట్టి గెలిపించిన మూమెంట్ నా కెరీర్ లో బెస్ట్: రస్సెల్

వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ XIలో తన కంటే ముందుగా ఎంపిక చేస్తున్నందున.. రిటైర్మెంట్ నిర్ణయించుకున్నాననే సూచనను అశ్విన్ తిరస్కరించాడు . "నేను వాషింగ్టన్ సుందర్ వల్లే రిటైర్ అయ్యానని కొందరు అనుకుంటున్నారు. అతను ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. కానీ ఇదంతా ఇతరులు చూసే విధానంలో ఉంటుంది". అని అశ్విన్ ఈ సందర్భంగా తెలిపాడు.