
యాక్జియం-4 (Axiom-4 ) మిషన్ లో భాగంగా అంతరిక్ష కేంద్రం వెళ్లిన శుభాంశు శుక్లా టీం యాత్ర ముగిసింది. 18 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో గడిపిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. స్పేస్ స్టేషన్ (ISS) నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణం అయ్యేందుకు సోమవారం (జులై 14) ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ హాచ్ క్లోజ్ అవ్వటంతో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.
Axiom-4 మిషన్ పూర్తైన సందర్భంగా.. స్పేస్ షిప్ అన్ డాకింగ్ కోసం ఫైనల్ ప్రిపరేషన్స్ ప్రారంభమయ్యాయి. స్పేస్ స్టేషన్ నుంచి అన్ డాకింగ్ సోమవారం (జులై 14) సాయంత్రం 4.30 గంటలకు పూర్తయ్యింది. దీంతో స్పేస్ షిప్ డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం మొదలైంది. హ్యాచ్ మూసివేతతో క్రూ అంతా స్పేస్ షిప్ లోకి ప్రవేశించారు.
Axiom-4 (Ax4)గ్రూప్ క్యాప్టెన్ గా వ్యవహరించిన శుభాంశుశుక్లా ISS చేరిన మొదటి ఇండియన్ . అదేవిధంగా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్రలో పాల్గొన్న రెండో భారతీయుడుగా చరిత్ర సృష్టించారు. స్పేస్ షిప్ కు శుక్లా పైలట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్ ..
అంతరిక్ష యాత్ర ముగించుకుని వస్తున్న డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్..మంగళవారం (జులై 15) మధ్యాహ్నం మూడు గంటలకు పసిఫిక్ సముద్రంలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో లాండ్ అవుతుంది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చేరుకోవడానికి మొత్తం ప్రయాణ సమయం 22.5 గంటలు పడుతుందని నాసా తెలిపింది.
ISS నుంచి క్రూ మెంబర్లు వీడ్కోలు సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ISS కమాండర్ తకుయా ఒనిషి శుభాంశు శుక్లా టీం సాహసోపేత యాత్రను అభినందించారు. వారి యాత్రపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అంతరిక్ష పరిశోధనలలో వారి కంట్రిబ్యూషన్ పై అభినందనలు తెలిపారు.
భూమికి చేరాక 7 రోజుల క్వారంటైన్:
యాక్సియం 4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ఇండియన్ అస్ట్రొనాట్ శుభాంశు శుక్లా భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలోని కోస్టల్ ఏరియాలో శుక్లాతో పాటు మరో ముగ్గురు అస్ట్రొనాట్లు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులు ల్యాండ్ అవుతారు. అస్ట్రొనాట్లను 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. స్పేస్‌లో గ్రావిటీ ఉండదు. ఇక్కడికొచ్చాక శుక్లా భూ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్లా హెల్త్ కండీషన్, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. స్పేస్‌లో శుభాంశు శరీరంపై పడిన ప్రభావంపై అధ్యయనం చేస్తారు.
►ALSO READ | మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు : గోవాకు అశోక్ గజపతిరాజు
శరీరంలో రక్త ప్రవాహం, గుండెతో పాటు మెదడు పనితీరును స్పేస్ జర్నీ ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను పరిశీలిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ గంటకు 28వేల కిలో మీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. భూ వాతావరణంలో ప్రవేశించాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. కాగా, నలుగురు అస్ట్రొనాట్లు గతనెల 25న ఐఎస్ఎస్కు బయలుదేరి వెళ్లారు. 18 రోజుల పాటు అందులోనే ఉన్నారు. రెండు వారాల్లో శుక్లా దాదాపు 96.5 లక్షల కిలో మీటర్లు ప్రయాణించాడు. 230 సార్లు భూమి చుట్టూ తిరిగారు.
18 రోజులపాటు అక్కడే.. శుక్లా టీం చేసిన ప్రయోగాలు
శుక్లా టీమ్.. ఐఎస్ఎస్లో 18 రోజులు ఉన్నారు. స్పేస్ స్టేషన్ లో ఉన్న 18 రోజులతో పాటు ప్రయాణానికి సంబంధించిన అన్ని రోజులు కలిపి 20 రోజులు పూర్తి చేసుకున్నారు. 20వ రోజు భూమిపై తిరిగి కాలుమోపనున్నారు. భార రహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై మొత్తం 60 ప్రయోగాలు చేశారు. వీటిలో ఇస్రో తరఫున శుభాంశు 7 ముఖ్యమైన ప్రయోగాలు చేశారు. దీంతో పాటు నాసా నిర్వహించే 5 జాయింట్ స్టడీస్‌లోనూ శుక్లా పాల్గొన్నారు.