
కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. హర్యానా, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ సోమవారం (జులై 14) ప్రకటన వెలువరించింది.
కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియామకం అయ్యారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ ను నియమించారు. యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకు ముందు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బి.డి.మిశ్రా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. అంతకు ముందు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బి.డి.మిశ్రా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. మిశ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎంగా పనిచేసిన కవిందర్ గుప్తాను నియమించారు. దీంతో లడఖ్ తో పాటు గోవా, హర్యానా గవర్నర్ల నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. దీంతో లడఖ్ తో పాటు గోవా, హర్యానా గవర్నర్ల నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
►ALSO READ | సోషల్ మీడియాలో హైదరాబాద్ Vs బెంగళూరుపై చర్చ : ఇక బెంగళూరును వదిలేయాల్సిందేనా..!
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అశోక్ గజపతి రాజు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం ఉన్న ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎస్ శ్రీధరన్ పిల్లై స్థానంలో ఆయన గోవా గవర్నర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు.
ప్రొఫెసర్ గా సుదీర్ఘ అకడమిక్ అనుభవం ఉన్న అషిమ్ కుమార్.. రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనను హర్యానా గవర్నర్ గా నియమించారు. ఇక కవీందర్ గుప్తా బీజేపీ సీనియర్ నాయకులు. జమ్మూ కశ్మీర్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బి.డి.మిశ్రా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కవీందర్ గుప్తాను నియమించారు.