Janhvi Kapoor: పెళ్లిపై మనసు విప్పిన జాన్వీకపూర్.. హనీమూన్ మాత్రం చాలా స్పెషల్ గా..!

Janhvi Kapoor: పెళ్లిపై మనసు విప్పిన జాన్వీకపూర్..  హనీమూన్ మాత్రం చాలా స్పెషల్ గా..!

బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. 'పరమ్ సుందరి' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ, ప్రస్తుతం 'సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. అదే సమయంలో తెలుగులో కూడా మెగా హీరో రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

పెళ్లి, హనీమూన్ పై జాన్వీ వ్యాఖ్యలు
సినిమాలతో పాటు జాన్వీ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె తన పెళ్లి, హనీమూన్ గురించి ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. "నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి. త్వరగా పెళ్లి ముగించుకుంటాను. కానీ హనీమూన్‌ను మాత్రం ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను" అని ఆమె వెల్లడించింది.  గతంలో కూడా జాన్వీ తన పెళ్లి తిరుపతిలో జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబానికి తిరుపతితో ఉన్న అనుబంధం వల్ల ఈ కోరిక ఆమెకు ఉంది. తన కలల పెళ్లి గురించి జాన్వీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శిఖర్ పహారియాతో ప్రేమాయణం?
జాన్వీ కపూర్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయంపై జాన్వీ కానీ, శిఖర్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, సోషల్ మీడియాలో వారి సన్నిహిత ఫోటోలు తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. జాన్వీ పెళ్లి గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు శిఖర్‌తో ఆమె పెళ్లిని సూచిస్తున్నాయా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

 జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్‌తో పాటు 'చాల్బాజ్' రీమేక్‌లో కూడా నటించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఆమె తన కెరీర్‌లో మరో పెద్ద అడుగు వేయనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.