Bigg Boss 9 Agnipariksha: 'బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్ష' ఫైనల్ డే .. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సామాన్యులు ఎవరంటే?

Bigg Boss 9 Agnipariksha:  'బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్ష'  ఫైనల్ డే ..  హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సామాన్యులు ఎవరంటే?

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్ ' తరుణం వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, ఉత్కంఠ, వినోదం, ఊహించని మలుపులతో ‘బిగ్ బాస్ తెలుగు 9’ (Bigg Boss Telugu 9) సరికొత్త డబుల్ హౌస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండటంతో..  బిగ్ బాస్ ఫీవర్ అభిమానుల్లో అలుముకుంది.

ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం... సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం. గత సీజన్‌ల మాదిరిగా కాకుండా, ఈసారి ఇంటి సభ్యుల ఎంపిక ప్రక్రియలో వినూత్నమైన మార్పులు చేశారు.  సామాన్యులను ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో ద్వారా ప్రధాన హౌస్‌లోకి పంపేందుకు ఒక ప్రత్యేక ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్రీ-షో ఇప్పటికే అంచనాలను అమాంతం పెంచేసింది. 

‘అగ్నిపరీక్ష’లో విజేతలు ఎవరు?
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో మొత్తం 15 మంది సామాన్య కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందు వారిని ఒక హౌస్‌లోకి పంపి, అనేక టాస్క్‌లు, సవాళ్లు ఇచ్చి వారి వ్యక్తిత్వాలను, ఆట తీరును పరీక్షించారు. ఈ అగ్నిపరీక్షలో భాగంగా ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. వారిలో ప్రసన్న కుమార్ ఒకరు కాగా మరొకరు  విదేశాల నుంచి వచ్చిన శ్వేత ఉన్నారు .

శ్వేత మొదట్లో బాగా ఆడినప్పటికీ, కీలకమైన టాస్క్‌లలో సరైన వ్యూహం లేకపోవడం, బెలూన్ టాస్క్‌లో ఆమె చూపించిన బలహీనత ఆమె ఎలిమినేషన్‌కు దారితీసిందని జ్యూరీ సభ్యులు నిర్ణయించారు. ఇక ప్రసన్న కుమార్ ఆటలో సరైన ప్రదర్శన చూపించలేకపోవడంతో అతడు కూడా హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు. ఈ ఇద్దరి ఎలిమినేషన్స్ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రసన్నను ఉంచాల్సింది అనే అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.

మెయిస్ హౌస్ లోకి ఐదుగురు..?
ప్రస్తుతం, అగ్నిపరీక్షలో అనుష రత్నం, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య, శ్రియ, మిస్ తెలంగాణ కల్కి, డాలియా, నాగ, డెమోన్ పవన్, మర్యాద మనీష్, పవన్ పడాల, హరీష్, షాకిబ్ సహా మొత్తం 13 మంది పోటీ పడుతున్నారు. ఈ రోజు ప్రసారం కానున్న ఫైనల్ ఎపిసోడ్‌లో, ఈ 13 మంది నుంచి కేవలం ఐదుగురిని మాత్రమే ప్రధాన హౌస్‌లోకి పంపనున్నారు. ఇది అధికారికంగా వెల్లడించకపోయినా, ఈ ఐదుగురు ఎవరనేది మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారి ఆటతీరు, ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఈ ఐదుగురిని ఎంపిక చేయనున్నారు.

సెలబ్రిటీల లిస్ట్... ఊహించని ట్విస్టులు
'బిగ్ బాస్' హౌస్‌ లోకి ప్రవేశించనున్న సెలబ్రిటీ కంటెస్టెంట్ల గురించి ఇప్పటికే పలు ఊహాగానాలు, లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   వారిలో దీపిక, దేబ్‌జాని, కావ్య, తేజస్విని, శివ కుమార్, రీతూ చౌదరి, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, ఇమ్మాన్యుయేల్, సాకేత్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు ఊహించని సెలబ్రిటీలు కూడా హౌస్‌లోకి రావచ్చని సమాచారం.  ఈసారి కొత్త కామన్ మ్యాన్ కంటెస్టెంట్లకు సెలబ్రిటీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ రెండు వర్గాల కలయిక, వారి మధ్య ఏర్పడే బంధాలు, విభేదాలు, డ్రామా ఈ సీజన్‌ను మరింత రంజుగా మారుస్తాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

►ALSO READ | Alcohol: ‘ఆల్కహాల్’ టీజ‌ర్‌ అదిరింది.. ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదిస్తావు.. మందు తాగ‌ని బతుకెందుకు

నాగార్జున హోస్ట్ గా.. మరింత రణరంగంగా.. 
హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇస్తూ, వారంలో జరిగిన సంఘటనలను విశ్లేషిస్తూ, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో కొత్త డబుల్ హౌస్ డిజైన్ ఎలా ఉండబోతోంది, ఎవరెవరు ఏ హౌస్‌లో ఉంటారు, వారి మధ్య పోటీ ఎలా సాగుతుంది అనే విషయాలు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో వెల్లడి కానున్నాయి.

మొత్తానికి, 'బిగ్ బాస్ తెలుగు 9' సీజన్... వినోదం, డ్రామా, అంచనాలను మించిన ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం. సెప్టెంబర్ 7న ఏం జరగబోతోందో, ఆ ఐదుగురు అగ్నిపరీక్ష విజేతలు ఎవరు, ప్రధాన హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరో రెండు రోజు వేచి చూడాల్సిందే. ఈ రణరంగం ఏమాత్రం ఉండబోతుందో చూడాలి మరి!