Alcohol: ‘ఆల్కహాల్’ టీజ‌ర్‌ అదిరింది.. ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదిస్తావు.. మందు తాగ‌ని బతుకెందుకు

Alcohol: ‘ఆల్కహాల్’ టీజ‌ర్‌ అదిరింది.. ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదిస్తావు.. మందు తాగ‌ని బతుకెందుకు

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్కహాల్‘. ఇది అల్లరి నరేష్ కెరియర్లో 63వ సినిమాగా రానుంది. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మెహర్ తేజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఇవాళ (సెప్టెంబర్ 4న) ఆల్కహాల్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా సాగింది. నరేష్, కమెడియన్ సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదిస్తావు కానీ మందు తాగ‌వు.. ఇంకా ఎందుకు నీ బ‌తుకు అని స‌త్య చెప్పే డైలాగ్‌ అక్కటుకుంటుంది. ఆ వెంటనే ‘తాగుడికి సంపాద‌న‌కు లింకే ముంది’. ‘తాగితే ఆల్క‌హాల్ న‌న్ను కంట్రోల్ చేస్తుంది. అది నాకు న‌చ్చ‌దు.’ అని న‌రేశ్ చెప్పే డైలాగ్‌ సైతం ఆసక్తి కలిగిస్తుంది.

తాగుడు అలవాటు లేని వ్యక్తికి, బలవంతంగా తాపితే, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు, ఎంటరయ్యే వ్యక్తుల ఏంటనేది? కథగా అనిపిస్తుంది. ఇందులో నటించే ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ.. వారి క్యారెక్టర్స్ని రివీల్ చేశారు, టీజర్ చివర్లో ‘తాగితే.. నన్ను కొట్టినట్టే వాళ్ళని కొడుతవా.. అని సత్య హీరో నరేష్ని అడగ్గా.. ' అలా ఎందుకు చేస్తా.. వాళ్ళని చంపేస్తా ’ అనడంతో మరింత ఉత్కంఠగా కలిగిస్తుంది.  

►ALSO READ | తండ్రి.. గురువు.. దైవం అన్నీ ఎన్టీఆరే: నిమ్మకూరు పర్యటనలో బాలకృష్ణ

అల్లరి నరేష్.. కామెడీ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్నారు. అయితే.. కొంతకాలం పాటు వరుస ప్లాప్స్తో సతమతమైన నరేష్, తన పంధా మార్చుకొని సీరియస్ రోల్స్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఉగ్రం, నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి హిట్స్ అందుకోవడమే కాకుండా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డిఫరెంట్ టైటిల్తో వస్తుండటం, తన ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. కాగా ఈ మూవీ 2026 జనవరి1న రిలీజ్ కానుంది.