హత్రాస్‌‌: తృణమూల్ ఎంపీలను నెట్టేసిన పోలీసులు

హత్రాస్‌‌: తృణమూల్ ఎంపీలను నెట్టేసిన పోలీసులు

లక్నో: హత్రాస్ గ్యాంగ్‌‌రేప్‌‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దళిత యువతి సామూహిక అత్యాచారంపై భగ్గుమన్న విపక్షాలు శుక్రవారం నిరసనకు దిగాయి. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబీకులను కలుసుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు డెరెర్ ఓబ్రెయిన్, కాకోలి ఘోష్ దస్తిదార్, ప్రతిమా మొండల్‌‌హావ్ హత్రాస్‌‌కు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, తృణమూల్ నేతలకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పోలీసులు నెట్టేయడంతో డెరెక్ ఓబ్రెయిన్ కింద పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల తీరుపై ఓబ్రెయిన్ మండిపడ్డారు. బాధితురాలి కుటుంబీకులను కలుసుకోనివ్వకం పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.