తొక్కిసలాట ఘటనలో భోలే బాబాపై ఫస్ట్ కేసు 

తొక్కిసలాట ఘటనలో భోలే బాబాపై ఫస్ట్ కేసు 

ఉత్తరప్రదేశ్ లో 121 మంది ప్రాణాలు కోల్పోయిన హత్రాస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాపై శనివారం (జూలై 6) ఫస్ట్ కేసు నమోదైంది. హత్రాస్ తొక్కిసలాట ఘట నతో తాను మానసికంగా కుంగిపోయానని.. ఘటనలో బాధిత కుటుంబాలు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని భోలే బాబా కోరారు. 

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ ను జూలై 5 న రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. జూలై 3న హత్రాస్ ఘటన వెనక ఏదైనా కుట్ర కోణంలో విచారణ చేపట్టేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల  జ్యుడిషియల్ కమిటీని యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. 

హత్రాస్ తొక్కిసలాట ఘటనతో సంబంధమున్న సూరజ్ పాల్ సింగ్ పై పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లో తొలి కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం ( జూలై 6) హత్రాస్ తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ఓ వీడియో మేసేజ్ పంపాడు. ఈ ఘటన తర్వాత చాలా బాధపడ్డాను. ప్రభుత్వం, పరిపాలన విభాగాంపై నమ్మకంతో ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు. ఈ గందరగోళానికి కారణమైన ఎవరిని విడిచిపెట్టకూడదు.. నా లాయర్ ద్వారా బాధితుల తరపున నిలబడతానని భోలే బాబా చెప్పారు.