
జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఒక సైనికుడు వీరమరణం పొందాడు. కుల్గాం జిల్లాలోని మోడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. జూలై 6వ తేదీ శనివారం రాత్రి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఈక్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు చెప్పారు. అయితే, ఓ జవాన్ కూడా వీరమరణం పొందారని తెలిపారు. ప్రస్తుతం మోడెర్గామ్ గ్రామంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.