గవర్నర్పై దీదీ తీవ్ర ఆరోపణలు

గవర్నర్పై దీదీ తీవ్ర ఆరోపణలు

కోల్ కతా: బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ట్విట్టర్ అకౌంట్ ను తాను బ్లాక్ చేశానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ ధన్కర్ పై ఆమె ఆరోపణలకు దిగారు. ‘ధన్కర్ గురించి ప్రధాని మోడీకి పలు లేఖలు రాశాను. ఆయన మా మాట వినడం లేదని, మాపై బెదిరింపులకు దిగుతున్నారని పీఎంకు నివేదించా. ఈ విషయం గురించి నేరుగా మోడీతో చర్చించా. గత ఏడాది కాలంగా దీన్ని ఓపికతో దీన్ని భరిస్తూ వచ్చాం. కానీ ధన్కర్ పలు ప్రభుత్వ ఫైళ్లను క్లియర్ చేయలేదు. ఎన్నో ఫైళ్లను పెండింగ్ లో పెట్టారు. అలాంటి ఆయన ప్రభుత్వ విధానాల గురించి ఎలా మాట్లాడగలరు?’ అని దీదీ ప్రశ్నించారు. అయినా ఇప్పటివరకు ధన్కర్ ను గవర్నర్ గా ఎలా కొనసాగిస్తున్నారని, ఆయన్ను పదవి నుంచి ఎందుకు తొలగించట్లేదని క్వశ్చన్ చేశారు. గవర్నర్ ఇంటి నుంచే పెగాసస్  నడుస్తోందన్నారు. ధన్కర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.  

కాగా, ఈ వివాదంపై గవర్నర్ ధన్కర్ స్పందించారు. అన్ని విషయాలను పక్కనబెట్టి దీదీ చర్చలకు రావాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి వివాదాలకు తావివ్వొద్దని.. చర్చలకు రావాలని  ఆహ్వానించారు. ప్రజల కోసం అధికారంలో ఉన్న వాళ్లు కలసి పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన పరిష్కారాల కోసం కూర్చుని మాట్లాడితే సరిపోతుందన్నారు. బెంగాల్ రక్తంతో కళంకితం అయ్యేందుకు తాను అనుమతించబోనని కూడా స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

యూపీ తగలబడుతుంటే వాళ్లు సెలబ్రేట్ చేసుకున్నరు

ఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రో’ ప్రమాదకరం

మోడీ, కేసీఆర్లు దొందూ దొందే