ఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రో’ ప్రమాదకరం

ఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రో’ ప్రమాదకరం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల్లో ఓ పదాన్ని తరచూ వాడుతుంటారు. ఆయన పాపులర్ స్పీచ్ లను గమనిస్తే.. మిత్రో (మిత్రులారా) అనే పదం బాగా వినిపిస్తుంది. ఇప్పుడు అదే పదాన్ని మోడీ సర్కారు మీదే వాడుతూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ వ్యంగ్య బాణాలు విసిరారు. మిత్రో పదాన్ని ‘ఓ మిత్రో’గా వాడుతూ.. ఇది ఒమైక్రాన్ కంటే ప్రమాదకరమని థరూర్ ట్వీట్ చేశారు. దేశంలో రోజురోజుకీ విభజన, విద్వేషం పెరగడం.. మతోన్మాదాన్ని ప్రోత్సహించడాన్ని చూస్తున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఈ వైరస్ కు తేలికపాటి వేరియంట్ లేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

మోడీ, కేసీఆర్లు దొందూ దొందే

హీరోయిన్స్ అంటే గ్లామర్ డాల్స్ కాదు

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ