న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైన నేపథ్యంలో.. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేసింది. బోర్డు విధించిన కొత్త మార్గదర్శకాలను వివరించడంతో పాటు వాటిని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ క్రమంలో ప్లేయర్ల నుంచి సంతకాలు కూడా తీసుకుంది. ముఖ్యంగా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్న రీల్స్, వ్లాగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. డ్రెసింగ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఇవన్నీ ఆపేయాలని హెచ్చరించిం ది. ఇన్‌స్టాలో అర్ష్‌దీప్‌కు 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్లేయర్లకు సంబంధించిన వీడియో లు, కంటెంట్‌లు కేవలం ఫ్రాంచైజీ అధికారిక ఖాతాల నుంచే పోస్ట్ చేయాలని ఆదేశించింది.
