చెరువులకు బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్లు గుర్తించారా?.. ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

చెరువులకు బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్లు గుర్తించారా?.. ప్రభుత్వాన్ని నిలదీసిన  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని చెరువులకు బఫర్‌‌‌‌ జోన్లను గుర్తించాలని గత ఏడాది జులైలో జారీ చేసిన ఆదేశాలు ఏ మేరకు అమలు చేశారని ప్రభుత్వాన్ని  హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  ఈ నెల 24న జరిగే విచారణలో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా పూర్తి వివరణ ఇవ్వాలని హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌ను ఆదేశించింది.  బఫర్‌‌‌‌ జోన్లను గుర్తించి నోటిఫై చేయాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

లేక్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ కమిటీకి ఇచ్చిన ఆదేశాల అమలు గురించి వివరాలు ఇచ్చేందుకు కాస్త గడువు కావాలని కోరారు. దీంతో చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్ తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో కౌంటర్‌‌‌‌ వేయాలని మరోసారి స్పష్టం చేసింది. రామన్నకుంట చెరువు ఎన్టీఎల్‌‌‌‌ పరిధిలో నేషనల్‌‌‌‌ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌‌‌‌ టూరిజం అండ్‌‌‌‌ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్‌‌‌‌ అక్రమ నిర్మాణలు చేస్తుంటే ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని పేర్కొంటూ హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కన్సూమర్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ సెల్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ వేసిన పిల్‌‌‌‌పై విచారణను ఈ నెల 24కి వాయిదా పడింది.