బెంగళూరు: మొన్నటిదాకా హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షాలు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టించాయి. శుక్రవారం బెంగళూరులో అతి భారీ వర్షం కురిసింది. దక్షిణ బెంగళూరులో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గురుదత్త లేఔట్, దాని చుట్టుపక్కల ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయాయి. హోసకేరేహల్లి, వృశభావతి నాలాలు పొంగి పొర్లాయి. వర్షాల ధాటికి దాదాపు 300 ఇళ్లు దెబ్బతిన్నాయి. 500 వాహనాలు కొట్టుకుపోయాయి. సిటీలోని 15 మేజర్ ఏరియాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కెంగెరిలో అత్యధికంగా 103 మిల్లీమీటర్లు, RR నగర్ లో 102 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
