సికింద్రాబాద్‎లో పుష్ప తరహాలో హవాలా డబ్బు తరలింపు.. 15 కి.మీ వెంటాడి పట్టుకున్న పోలీసులు

సికింద్రాబాద్‎లో పుష్ప తరహాలో హవాలా డబ్బు తరలింపు.. 15 కి.మీ వెంటాడి పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 సినిమా చూసే ఉంటారు.. ఈ సినిమాలో పోలీసులకు అనుమానం రాకుండా డబ్బులను సోఫా లోపల పెట్టి హవాలా దందా సాగిస్తాడు హీరో. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ జంట నగరం సికింద్రాబాద్‎లోనూ జరిగింది. కాకపోతే ఇక్కడ సోఫాలో కాకుండా కారులోని వివిధ భాగాల్లో పెట్టి హవాలా డబ్బును తరలించారు. కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో కనిపించకుండా డబ్బు కట్టలు దాచి తరలిస్తున్నారు. 

ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన హవాలా ముఠా కారుతో ఉడాయించారు. అయినప్పటికీ వదిలిపెట్టిన పోలీసులు హవాలా డబ్బు తరలిస్తున్న కారును దాదాపు 15 కిలో మీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్నారు. కార్‎ను మొత్తం ఓపెన్ చేయించి రూ.4 కోట్ల హవాలా డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన డబ్బు ఎవరిది..? ఎక్కడికి తరలిస్తున్నారు..? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

►ALSO READ | ఐబొమ్మరవి కేసులో బిగ్ ట్విస్ట్.. మరోసారి పోలీస్ కస్టడీ