Best Test XI of the 21st Century: ఈ శతాబ్దపు బెస్ట్ టెస్ట్ ప్లేయింగ్ 11 ప్రకటించిన విలియంసన్, హేడెన్

Best Test XI of the 21st Century: ఈ శతాబ్దపు బెస్ట్ టెస్ట్ ప్లేయింగ్ 11 ప్రకటించిన విలియంసన్, హేడెన్

ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 21వ శతాబ్దంలో బెస్ట్ టెస్ట్ జట్టును ప్రకటించారు. హేడెన్, కేన్ విలియమ్సన్ ప్రకటించిన జట్లలో ఒక్కరు కూడా కామన్ గా లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. మొదట  తన జట్టుకు ఓపెనర్లుగా అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్‌లను ఎంచుకున్నాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల కోసం వరుసగా కల్లిస్, లారా, విరాట్ కోహ్లిలను ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో లక్ష్మణ్ కు చోటు కల్పించాడు.

వికెట్ కీపర్ గా ఆస్ట్రేలియా ఆల్ టైం బెస్ట్ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ను సెలక్ట్ చేశాడు. షేన్ వార్న్ ను ఏకైక స్పిన్నర్ గా ఎంచుకున్న హేడెన్.. ఫాస్ట్ బౌలర్లుగా కమ్మిన్స్, బ్రెట్ లీ, అండర్సన్ లకు తన జట్టులో చోటు కల్పించాడు. విలియంసన్ విషయానికి వస్తే హేడెన్ జట్టులో ఒక్క ప్లేయర్ ను కూడా సెలక్ట్ చేయకపోవడం విశేషం. తన టెస్ట్ జట్టు ఓపెనర్లుగా హేడెన్, సెహ్వాగ్ లను సెలక్ట్ చేశాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల కోసం వరుసగా పాంటింగ్, టెండూల్కర్, స్టీవ్ స్మిత్ లను ఎంచుకున్నాడు.

►ALSO READ | IND vs ENG 2025: టెస్ట్ కెప్టెన్ అవుతానని ముందే తెలిసినా మా నాన్నకు చెప్పలేదు: గిల్ ఎమోషనల్

ఆరో స్థానంలో విధ్వంసకర బ్యాటర్ డివిలియర్స్ ను వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీకి తన జట్టులో చోటు కల్పించాడు. శ్రీలంక ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్ మురళీధరన్ ను ఏకైక స్పిన్నర్ గా తన జట్టులోకి తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా డేల్ స్టెయిన్, షోయబ్ అక్తర్, గ్లెన్ మెగ్రాత్ విలియంసన్ జట్టులో ఉన్నారు. 

21వ శతాబ్దపు కేన్ విలియమ్సన్ అత్యుత్తమ టెస్ట్ XI:

మాథ్యూ హేడెన్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, ఎబి డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేల్ స్టెయిన్, షోయబ్ అక్తర్, గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్.

21వ శతాబ్దపు మాథ్యూ హేడెన్ అత్యుత్తమ టెస్ట్ XI:

అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, జాక్వెస్ కల్లిస్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లీ, వివిఎస్ లక్ష్మణ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, పాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ, జేమ్స్ ఆండర్సన్.