హ‌‌‌‌జ్ యాత్రికులకు రాష్ట్ర సర్కార్ తీపి క‌‌‌‌బురు.. మక్కా యాత్ర ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది

హ‌‌‌‌జ్ యాత్రికులకు రాష్ట్ర సర్కార్ తీపి క‌‌‌‌బురు.. మక్కా యాత్ర ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: ప‌‌‌‌శ్చిమాసియాలో నెల‌‌‌‌కొన్న ప‌‌‌‌రిస్థితులతో హ‌‌‌‌జ్ యాత్ర భారంగా మారింది. ఈ నేప‌‌‌‌థ్యంలో యాత్రికుల‌‌‌‌కు అండగా నిలిచి ఆ ఖర్చును ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​నిర్ణయించింది. తెలంగాణ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో మ‌‌‌‌క్కా హ‌‌‌‌జ్ యాత్రకు వెళ‌‌‌‌తారు. ఈ ఏడాది సుమారు 7 వేల మంది హ‌‌‌‌జ్ యాత్రకు వెళ్లేందుకు న‌‌‌‌మోదు చేయించుకున్నారు.

పేద ముస్లింలు జీవిత‌‌‌‌కాలంలో ఒక్కసారైనా హ‌‌‌‌జ్‌‌‌‌కు వెళ్లాల‌‌‌‌నే ఉద్దేశంతో పోగేసుకుని వెళ్తుంటారు.  కానీ ఇరాన్‌‌‌‌, అమెరికా యుద్ధంతో ఇంధ‌‌‌‌న ధ‌‌‌‌ర‌‌‌‌లు పెరిగి హ‌‌‌‌జ్ యాత్ర భారంగా మారింది. ఈ నేప‌‌‌‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హ‌‌‌‌జ్ యాత్రికులకు ఆర్థికంగా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.