అక్టోబర్ 20న హెచ్‌‌‌‌సీఏ ఎలక్షన్స్‌‌‌‌

 అక్టోబర్ 20న హెచ్‌‌‌‌సీఏ ఎలక్షన్స్‌‌‌‌
  •     11 నుంచి నామినేషన్లు
  •     173 మందితో ఓటర్ల జాబితా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న  హైద‌‌‌‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌‌‌‌న్ (హెచ్‌‌‌‌సీఏ) ఎన్నిక‌‌‌‌ల న‌‌‌‌గారా మోగింది. హెచ్‌‌‌‌సీఏ ఆఫీస్‌‌‌‌ బేరర్ల ఎలక్షన్‌‌‌‌కు శనివారం నోటిఫికేష‌‌‌‌న్ వెలువ‌‌‌‌డింది. ఈ నెల 20న ఎలక్షన్స్‌‌‌‌ జరగనున్నాయి. ఎలక్షన్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌తో పాటు 173 మందితో కూడిన ఓట‌‌‌‌ర్ల జాబితాను రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ వీఎస్‌‌‌‌ సంపత్‌‌‌‌ విడుదల చేశారు. 2021 ఏజీఎం మేరకు ప్రకటించిన ఈ జాబితాలో అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

10న తుది జాబితా  విడుదల చేస్తామన్నారు. 11 నుంచి 13వ తేదీ వ‌‌‌‌ర‌‌‌‌కు నామినేష‌‌‌‌న్లు స్వీక‌‌‌‌రించి 14న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల విత్‌‌‌‌డ్రాకు 16వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.  కాగా, ఓటర్ల జాబితాలో 101 క్లబ్స్‌‌‌‌, 48 ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌తో పాటు ఏడుగురు మెన్స్‌‌‌‌, ఎనిమిది మంది విమెన్స్ ఇంటర్నేషనల్​ క్రికెటర్లకు అవకాశం కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 4న ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో అందరు వాటాదారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు రిటర్నింగ్‌‌‌‌ అధికారి పేర్కొన్నారు.ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో పేరున్న అందరూ దీనికి అటెండ్‌‌‌‌ అవ్వాలని సూచించారు..