భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ టిక్కెట్లలో గోల్మాల్ చేసిండు : విజయ్ ఆనంద్

భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ టిక్కెట్లలో గోల్మాల్ చేసిండు : విజయ్ ఆనంద్

హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ జనరల్ సెక్రటరీ విజయ్ ఆనంద్ అన్నారు. భారత్ –న్యూజిలాండ్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించారు. ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా తనను కనీసం సంప్రదించలేదని వాపోయారు. తనను బెదిరించి చెక్కులపై సంతకాలు పెట్టించుకున్నారని.. తాను దళితుడిని కావడం వల్లే తనపై చిన్నచూపు వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనొక్కడినే కాదని.. ప్యానెల్ మొత్తాన్ని అజార్ పక్కనబెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు.

రేపు ఉప్పల్ స్టేడియంలో భారత్–న్యూజిలాండ్ తొలి వన్డే జరగనుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.