
తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో నిధుల దుర్వినియోగం వ్యవహారం సాగుతోంది. HCA నిధుల దుర్వినియోగం పై మరోసారి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు CID సిఫారసు చేసింది. ఆడిట్ నిర్వహించిన తర్వాత నిధుల దుర్వినియోగం పై CID క్లారిటీ కి రానుంది.
జగన్ మోహన్ రావ్ అధ్యక్షుడు అయ్యిన నాటి నుంచి HCA కు రూ.240 కోట్లు నిధులు మంజూరు చేసింది BCCI. కానీ ప్రస్తుతం HCA ఖాతాలో కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే ఉందన్న CID ఆడిట్ కు ఆదేశించింది. 20 నెలలో HCA రూ.200 కోట్లు ఖర్చు చేసనట్లు తేలింది. అయితే దేని కోసం ఖర్చు చేశారో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడనుందని అధికారులు చెబుతున్నారు.
2014 నుంచి HCA అక్రమాల పై ఇప్పటికే రెండు సార్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. లేటెస్ట్ గా CID సిఫార్సు తో మరోసారి HCA లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ జరుగుతోంది.