రాష్ట్రంలో HCCB రూ.1000 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో HCCB రూ.1000 కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో HCCB  600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ హెచ్సీసీబీ మధ్య ఎంఓయూ కుదిరిందని చెప్పారు. సిద్ధపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్  ఏర్పాటుకు హిందూస్థాన్ కోకోకోలా బేవరేజెస్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కోసం..TSIIC 48.53 ఎకరాలు కేటాయించింది. 

కొత్తగా నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ లో లిక్విడ్స్ని రీసైక్లింగ్ చేయడంతో పాటు రీప్రొడ్యూస్ చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ ఫ్యాక్టరీ ప్యాకేజ్డ్ వాటర్, కూల్ డ్రింక్స్ ఉత్పత్తి చేయనున్నారు.  లేటెస్ట్ టెక్నాలజీతో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు HCCB సీఈఓ నీరజ్ గార్గ్ చెప్పారు. ఈ ప్లాంటులో 40శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

రైతుల నుంచి వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యత

60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు: జీవితమంతా కోర్టు మెట్లెక్కడమేనా..?