64 ఏళ్ల వయసులో ఇది నాకు మూడో జన్మ: కుమార స్వామి

64 ఏళ్ల వయసులో  ఇది నాకు మూడో జన్మ: కుమార స్వామి

ఇటీవల తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు చికిత్స అందించిన వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.  దేవుడు అందరికి ఒక జన్మనిస్తే.. 64 ఏళ్ల వయసులో  తనకు మూడో జన్మ ఇచ్చాడని చెప్పారు . స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు.  తన గురించి తాను పట్టించుకోకుండా ఉండి ఉంటే జీవితాంతం బెడ్ కే పరిమితం అయ్యే వాడినని చెప్పుకొచ్చారు.

కుమార్ స్వామి ఆగస్టు 30న తెల్లవారుజామున  అస్వస్థతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.  ఆయనకు స్ట్రోక్ వచ్చిందని సకాలంలో  సర్జరీ చేయడంతో ముప్పు తప్పిందని డాక్టర్లు తెలిపారు.