గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఆరో అతిపెద్ద బ్యాంక్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఆరో అతిపెద్ద బ్యాంక్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ

న్యూఢిల్లీ: మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద బ్యాంక్‌‌‌‌‌‌‌‌గా హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్  అవతరించింది. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీతో విలీనం అయ్యాక హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 146 బిలియన్ డాలర్లకుపెరిగింది. 418 బిలియన్ డాలర్లతో జేపీ మోర్గాన్ మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, 212 బిలియన్ డాలర్లతో బ్యాంక్ ఆఫ్ అమెరికా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

ఈ రెండు యూఎస్ బ్యాంకుల మధ్య  200 బిలియన్ డాలర్ల గ్యాప్ ఉండడాన్ని గమనించాలి.  చైనా ఐసీబీసీ (206 బిలియన్ డాలర్లు) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. వెల్స్‌‌‌‌‌‌‌‌ ఫార్గో, హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీసీ బ్యాంకులు హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ కంటే ముందున్నాయి. బ్యాంక్ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6 %  పడింది.