నెల రోజుల పాటు HDFC డిస్కౌంట్స్

నెల రోజుల పాటు HDFC డిస్కౌంట్స్

హైదరాబాద్‌‌, వెలుగు : బ్యాంకింగ్‌‌ దిగ్గజం హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ ఆన్‌‌లైన్ కామర్స్‌‌లో దిగ్గజాలకు పోటీగా తయారైంది. అమెజాన్‌‌–ఫ్లిప్‌‌కార్ట్‌‌లకు ధీటైన ఆఫర్స్‌‌ అందిస్తోంది. ఏకంగా నెల రోజులపాటు కస్టమర్లకు బెస్ట్‌‌ డీల్స్ అందించేందుకు సిద్ధమైంది. పండగ సీజన్‌‌ సందర్భంగా సోమవారం నుంచి ఈ డిస్కౌంట్‌‌  ధమాకాను బ్యాంకు అందుబాటులోకి తెచ్చింది. వెయ్యికిపైగా ప్రొడక్ట్స్‌‌పై తమ క్రెడిట్‌‌, డెబిట్‌‌ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్స్‌‌, క్యాష్‌‌బ్యాక్స్‌‌ అందించనున్నట్లు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ సౌత్‌‌ హెడ్‌‌ మధుసూదన్ హెగ్డే వెల్లడించారు. రిలయన్స్‌‌ డిజిటల్‌‌, శాంసంగ్‌‌, యాపిల్‌‌ వంటి పెద్ద కంపెనీలతో ఇందుకోసం జత కట్టినట్లు తెలిపారు. ఫ్లిప్‌‌కార్ట్‌‌, అమెజాన్‌‌లలో మూడు–నాలుగు రోజులే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కానీ, ఈ డిస్కౌంట్‌‌ ధమాకాను మేం నెల రోజులపాటు అందుబాటులోకి తెస్తున్నామని హెగ్డే పేర్కొన్నారు. దేశమంతటా ఈ ధమాకా అమలవుతోందని, రెండు తెలుగు రాష్ట్రాలలోని కస్టమర్లు అధికంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఇండియాలో డిమాండ్‌‌ తగ్గుతోందనే ఆందోళనల నేపథ్యంలో కన్సంప్షన్‌‌ పెంచేందుకు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంకు తన వంతు చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. దేశంలోని 5 వేల హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ బ్రాంచ్‌‌లు ఇకమీదట ఫైనాన్షియల్‌‌ సూపర్‌‌ మార్కెట్లుగా అవతరించనున్నాయని, తమ వెబ్‌‌సైట్‌‌, పేజ్‌‌యాప్‌‌, స్మార్ట్‌‌బైల ద్వారానూ కస్టమర్లను తమను చేరుకోవచ్చని మధుసూదన్‌‌ హెగ్డే వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి గంటకూ ఒక లక్కీ డ్రా ఉంటుందని, ఐఫోన్‌‌ 11 ను గెలుపొందిన వారికి గిఫ్ట్‌‌గా ఇవ్వనున్నామని తెలిపారు. పండగ సీజన్‌‌ సందర్భంగా బిజినెస్ లోన్స్‌‌పై ప్రాసెసింగ్‌‌ ఫీ సగానికి తగ్గిస్తున్నామని, చిన్న వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.