HDFC బ్యాంక్ లోన్లలో వృద్ధి.. డిపాజిట్లు 14 శాతం జంప్

HDFC బ్యాంక్ లోన్లలో వృద్ధి.. డిపాజిట్లు 14 శాతం జంప్

న్యూఢిల్లీ: దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ మార్చి క్వార్టర్ లెక్కలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బ్యాంక్ లోన్లు 12 శాతం పెరిగి రూ.29.6 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు కూడా 14.4 శాతం వృద్ధితో రూ.31.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది రూ.27.14 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. కాసా (సీఏఎస్​ఏ) డిపాజిట్లు 12.3 శాతం వృద్ధి సాధించి రూ.10.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

బ్యాంక్ కాలపరిమితి డిపాజిట్లు 15.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదిలా ఉంటే, ఇదే సమయంలో బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. నైతిక విలువలకు సంబంధించిన కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  పదవీ కాలం మధ్యలోనే వైదొలగడం చర్చనీయాంశమైంది. హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బ్యాంక్ విలీన ప్రక్రియ సమయంలో ఆయన చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించారు.  తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ.18 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం బ్యాంక్ కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయని బ్యాంకు ప్రకటించింది.