Dhoni vs Jadeja: రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులోకి ట్రెండింగ్ అయినప్పటికీ, మహేంద్ర సింగ్ ధోనీపై భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఉన్న అభిమానం, గౌరవం ఏమాత్రం తగ్గలేదు.. తాజాగా రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ఒక ర్యాపిడ్ ఫైర్ వీడియోలో, మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ బ్యాటర్‌ని నమ్ముతారు? అని ప్రశ్నించగా.. జడేజా క్షణం కూడా ఆలోచించకుండా ఎంఎస్ ధోనీ పేరు చెప్పాడు. తన అంతర్జాతీయ కెరీర్‌తో పాటు ఐపీఎల్‌లో అత్యధిక కాలం ధోనీ నాయకత్వంలోనే ఆడిన జడేజా, తలాపై తనకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని ఈ కామెంట్స్ ద్వారా మరోసారి చాటుకున్నాడు.
మళ్లీ సీఎస్కేకి రావాలని డిమాండ్:
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జడేజా, సామ్ కర్రన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసి, వారి స్థానంలో సంజు శాంసన్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫ్రాంచైజీ మారినప్పటికీ ఇరువర్గాల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు. ధోనీపై జడేజా చేసిన వ్యాఖ్యలు చూసిన చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. సర్ జడేజా మళ్లీ తమ పసుపు చొక్కా (CSK) గూటికి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
శ్రీలంక టెస్ట్ సిరీస్‌తో భారత జట్టులోకి రీ-ఎంట్రీ:
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కి దూరమైన రవీంద్ర జడేజా, త్వరలో జరగబోయే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన భారత సీనియర్ జట్టులోకి తిరిగి సెలక్ట్ అయ్యాడు. టెస్టుల్లో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో కలిసి స్పిన్ ఆల్‌రౌండర్‌గా జడేజా శ్రీలంక పర్యటనలో కీలక పాత్ర పోషించనున్నాడు.
►ALSO READ | 2027 వరల్డ్‌కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడటం దాదాపు ఖాయం?.. అభిమానుల్లో జోష్!
చెన్నైతో 12 ఏళ్ల ప్రయాణం:
సీఎస్‌కే (CSK) ఫ్రాంచైజీతో రవీంద్ర జడేజాది దశాబ్ద కాలానికి పైగా సాగిన సుదీర్ఘ అనుబంధం. 2012లో చెన్నైలోకి వచ్చిన జడేజా, సీఎస్కే తరఫున 12 సీజన్లలో ఆడి 152 వికెట్లతో పాటు 2,354 రన్స్ చేశాడు. ఒక టీ20 ప్లేయర్‌గా ఉన్న జడేజాను అన్ని ఫార్మాట్లలో ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడంలో మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర అత్యంత కీలకమైంది. 2022లో కెప్టెన్సీ మార్పు సమయంలో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ, 2023 ఐపీఎల్ ఫైనల్లో సీఎస్‌కేను విజేతగా నిలిపిన జడేజాను ధోనీ ఎత్తుకుని సంబరాలు చేసుకున్న దృశ్యం ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయింది.
You know the bond when the answer doesn’t even take a second 🫶
— Rajasthan Royals (@rajasthanroyals) July 29, 2026
Stay tuned for 𝐑𝐨𝐲𝐚𝐥𝐬 𝐑𝐚𝐩𝐢𝐝 𝐅𝐢𝐫𝐞 ft. Ravindra Jadeja & Vaibhav Sooryavanshi at @ 11 AM ⏳💗 pic.twitter.com/KsLYLvKJo4
Dangerous duo of CSK 💛🫂 pic.twitter.com/tDIq0hiseD
— Bunny Cricket (@cricketclub016) July 29, 2026
