హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం కానున్న హెచ్డీఎఫ్సీ

హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం కానున్న హెచ్డీఎఫ్సీ

న్యూఢిల్లీ: కార్పొరేట్ హిస్టరీలో మరో రెండు సంస్థల విలీనం ఖరారైంది.  మోర్టగేజ్ రుణ సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ విలీనం కానున్నాయి. ఈ మేరకు తమ బోర్డు ఆమోదం లభించినట్లు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. దీంతో హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ లిమిటెడ్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ లో విలీనం కానున్నాయి. దీనికి సెబీ, సీసీఐ, ఆర్బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. విలీన ప్రక్రియ 2023–24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. దీంతో రెండు కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.

మరిన్ని వార్తల కోసం:

త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్ 

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు