నా భార్య ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు.. సీమంతంలో ఆధారాలు చూపించిన భర్త

నా భార్య ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు.. సీమంతంలో ఆధారాలు చూపించిన భర్త

తల్లిసౌభాగ్యం, పుట్టబోయే బిడ్డ క్షేమ కోసం గర్భిణీ స్త్రీకి ఏడోనెల లేదంటే తొమ్మిదోనెలలో కుటుంబసభ్యులు, ముత్తైదువులు గాజులు తొడిగి దీవిస్తారు. మన దేశ సాంప్రదాయం ప్రకారం సీమంతం ఇలా జరుగుతుంది. ఇలా ఒక్కోదేశాన్ని సీమంతం చేసే తీరు మారుతుంది.

అయితే బొలీవియా దేశంలో ఓ గర్భిణీ స్త్రీకి సీమంతం జరిగింది. ఆ సీమంతానికి కుటుంబ సభ్యులతో పాటు భర్త తరుపు లాయర్ కూడా హాజరయ్యాడు. అందరు సంతోషంగా ఉన్న సమయంలో తన భార్యకు పుట్టబోయే బిడ్డకు తాను తండ్రిని కాదంటూ బాంబు పేల్చాడు. అనంతరం లాయర్ దగ్గరున్న కొన్ని ఆధారాలతో భార్య ఇల్లీగల్ ఎఫైర్ ను బహిర్ఘతం చేశాడు.  గత మూడేళ్లుగా తన భార్య  ఫ్యామిలీ మెంబర్ తో ఎఫైర్ కొనసాగిస్తుందంటూ వీడియోల్ని విడుదల చేశాడు. ఆ వీడియోలు చూసిన అతిధులందరూ కంగుతిన్నారు. అదే ఫంక్షన్ లో భార్య ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తికూడా ఉండడంతో అతిధులందరూ నిందితుణ్ని చితకబాదారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.