పిల్లలకు చదువు దూరం కావొద్దని..

పిల్లలకు చదువు దూరం కావొద్దని..

ఆ ఊళ్లో బడికి వెళ్లే పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ కొవిడ్​ కాలం కదా! బడులు బంద్​ అయ్యాయి. ఆ పిల్లలంతా చదువుకు దూరం అయ్యారు. ఆన్​లైన్​ క్లాసులు జరిగాయి. కానీ, అవన్నీ గిరిజనుల కుటుంబాలు. సరైన టెక్నికల్​ సపోర్ట్​ లేకపోవడం వల్ల వాటికీ అటెండ్​ కాలేదు. దీంతో చొరవ తీసుకున్న టీచర్​ దీప్​ నాయక్​ బడినే వాళ్ల దగ్గరకు తెచ్చాడు. వెస్ట్​ బెంగాల్ లోని వర్ధమాన్ జిల్లాలో జోబా అత్పారా అనే ఊరు. అక్కడ గిరిజనులు ఉంటారు. కోవిడ్​ వల్ల పిల్లలంతా ఇంటి దగ్గరే ఉండటాన్ని గమనించాడు. ఆన్​లైన్​ క్లాస్​లకు వెళ్లకపోవడాన్ని చూశాడు. దీంతో ఆ ఊరి వీధులనే క్లాస్​ రూమ్​లుగా, గోడలనే బ్లాక్​ బోర్డులుగా మార్చేశాడు. ఏడాది కాలంగా ఆ వీధుల్లోనే పిల్లలకు చదువు చెబుతున్నాడు.

దగ్గర్లోని స్కూళ్ల నుంచి ఎక్విప్​మెంట్​ తెచ్చి పిల్లలకు ఇస్తున్నాడు. ఆ ఊరికి చెందిన పిల్లలు ఎవరూ చదువుకు దూరం కావొద్దనేది దీప్​ సింగ్​  ఆలోచన. ఇలా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పిల్లలందర్నీ చేరదీశాడు. రైమ్స్​, ఎక్కాలు, సైన్స్​ పాఠాలు అన్నీ ఒక్కడే అందరికీ చెబుతున్నాడు. ‘ఈ స్టూడెంట్లు అంతా కూలీల పిల్లలు. వీళ్లకు చదువు అందకపోతే ఎంతో నష్టపోతారు. అందుకే ఈ ఫస్ట్​ జనరేషన్​ పిల్లలకి చదువు అందించాలని స్ట్రీట్​ స్కూల్​ నడుపుతున్నాను’ అని చెప్పాడు దీప్​ నాయక్​.