యువతిపై అత్యాచారం చేశాడు.. విదేశాలకు పారిపోతూ పోలీసులకు చిక్కాడు

యువతిపై అత్యాచారం చేశాడు.. విదేశాలకు పారిపోతూ పోలీసులకు చిక్కాడు

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ప్రేమ పేరుతో యువతిని నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉంటున్నాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం చేశారు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని దేశం విడిచి వెళ్లేందుకు యత్నించిన యువకుడిని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు పోలీసులు... వివరాల్లోకి వెళితే..

జనగామ జిల్లాకు చెందిన స్వామి బండారి అనే వ్యక్తి అస్ట్రేలియాలో ఉంటున్నట్లు ఛత్తీస్ గఢ్ కు చెందిన యువతితో ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు. పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. సికింద్రాబాద్ పరిధిలోని మహంకాళీ పోలీస్ స్టేషన్ లో ని ఓ హోటల్ లో అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆస్ర్టేలియాకు పారిపోయేందుకు యత్నించారు. 

యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు స్వామి బండారిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీరో ఎఫ్ ఐఆర్ ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు పోలీసులు.