రైతులకు కేసీఆర్ ​చేసిందేమీ లేదు

రైతులకు కేసీఆర్ ​చేసిందేమీ లేదు

విడతలవారీ రుణమాఫీతో అప్పులపాలు : జగ్గారెడ్డి 

హైదరాబాద్, వెలుగు : రైతులకు కేసీఆర్​సర్కారు చేసిందేమీ లేదని, పది రూపాయలిచ్చి 90 ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ ఏకకాలంలో కాకుండా విడతలవారీగా చేయడంతో రైతులు వడ్డీల మీద వడ్డీలు కట్టలేక అప్పులపాలయ్యారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలో  ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు. చారానా ఇచ్చి బారానా ఇచ్చినట్టు చెప్పుకోవడం టీఆర్​ఎస్​కు అలవాటైపోయిందన్నారు. కేసీఆర్​ వచ్చాకే రైతులు తిండితింటున్నట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్​  కూడా ఉచిత విద్యుత్​ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్​ వ్యవసాయానికి పెద్ద పీట వేసిందన్నారు. రైతులకు తామేం చేశామో, అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో రాహుల్​ సభలో ప్రకటిస్తామని చెప్పారు.