అతన్ని ఉరితీయాలి: లావణ్య కుటుంబ సభ్యులు

అతన్ని ఉరితీయాలి: లావణ్య కుటుంబ సభ్యులు

నమ్మించి కూతురి గొంతు కోసిన సునీల్ ను బతకనీయకూడదన్నారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లావణ్య కుటుంబ తల్లిదండ్రులు. అలాంటి వాడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించడం కాకుండా ఉరి తీయాలన్నారు. తమ కుటుంబానికి కలిగిన బాధ..మరే కుటుంబానికి రాకూడదని కోరుకుంటున్నామన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సునీల్ దారుణంగా చంపేశాడని అలాంటి వాడికి తగిన శిక్ష విధించాలన్నారు.

మస్కట్ లో జాబ్ ఇప్పిస్తానంటూ చెప్పిన సునీల్ అన్ని ఫేక్ ఐడి కార్డ్ లు సృష్టించి..లావణ్యను తీస్కెళ్లి హత్య చేశాడన్నారు కుటుంబ సభ్యులు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న లావణ్యను, ఆమె క్లాస్ మేట్, మోల్టెన్ సంస్థలో పనిచేస్తున్న సునీల్ అత్యంత దారుణంగా హతమార్చాడు. హత్య చేసి సూట్ కేసులో కుక్కి హైదరాబాద్ సూరారం కాలువలో పడేశాడు. లావణ్య తల్లిదండ్రుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేపట్టారు. సూరారం కాలువలోని సూట్ కేసులో మృత దేహం లావణ్యదిగా గుర్తించారు. తర్వాత హత్య చేసిన సునీల్ ను అరెస్టు చేశారు.