ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లు అమ్మాడు : డీసీపీ

ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లు అమ్మాడు : డీసీపీ

ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ల విక్రయానికి  పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.  కళ్యాణ్ చక్రవర్తి మూడేళ్లుగా తప్పించుకోని తిరుగుతున్నాడని చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ మేరీ సువర్ణ భూమి రిసార్ట్స్ లో డైరెక్టర్ గా ఉన్న మంచాల సాయి సుధాకర్, కళ్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు కొన్ని ప్లాట్లను ఫోర్జరీ సంతకాలతో పలు ప్లాట్లు అమ్మారని అన్నారు. నిధులు దుర్వినియోగం చేశారని మేరీ సువర్ణ భూమికి సంబంధించిన కే.రోజారాణి ఫిర్యాదు చేశారని తెలిపారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మంచాల సుధాకర్ ను తేదీ డిసెంబర్ 2021లో అరెస్టు చేశారని తెలిపారు. రెండో నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నాడని అప్పటి నుంచి అతని కోసం చేధించి శుక్రవారం విజయవాడలో అరెస్టు చేశామని అన్నారు. నకిలీ సంతకాలతో మోసపూరితంగా ప్లాట్లను అమ్ముతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. డాక్యుమెంటును పోరిన్సిక్ ల్యాబ్ కు న్యాయస్థానం ద్వారా పంపగా  ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సంతకాలు ఫోర్జరీ  కాబడినట్టు నిర్ధారణ కావడంతో వీరిపైన  420,406,468,467,471, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు. నిందితులను రిమాండ్ కు  తరలించామని వీరిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు.