కెప్టెన్సీ గిల్ హక్కు.. అతనికి ఎవరూ ఫేవర్ చెయ్యలేదు: గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌

కెప్టెన్సీ గిల్ హక్కు.. అతనికి ఎవరూ ఫేవర్ చెయ్యలేదు: గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టీమిండియా  కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్‌‌‌‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌‌‌‌కు టీమ్ కెప్టెన్సీ ఎవరూ బహుమతిగా ఇవ్వలేదని, అది తన కఠోర శ్రమ, అంకితభావంతో అతడు సంపాదించుకున్న హక్కు అని గంభీర్ స్పష్టం చేశాడు. ‘గిల్‌‌‌‌ను అతని సహజ శైలిలో ఆడనివ్వడమే నా పని. అతనికి టెస్టు లేదా వన్డే కెప్టెన్సీ ఇచ్చి ఎవరూ తనకు ఫేవర్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. దానికి అతను నూటికి నూరు శాతం అర్హుడు. దాని కోసం అతను చాలా కష్టపడ్డాడు. కెప్టెన్‌‌‌‌గా తన అత్యంత కఠినమైన పరీక్షను ఇంగ్లండ్‌‌‌‌లోనే పూర్తి చేశాడు. 

బలమైన ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ను వారి సొంత గడ్డపై  ఎదుర్కొని ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌ను నడిపించడం కంటే పెద్ద సవాల్ ఏముంటుంది..? రెండున్నర నెలల పాటు సాగిన ఆ టూర్‌‌‌‌‌‌‌‌లో  గిల్ కెప్టెన్‌‌‌‌గా ఎంతో పరిణతి కనబరిచాడు’ అని వెస్టిండీస్‌‌‌‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత గంభీర్ పేర్కొన్నాడు. తన ఆటతోనే కాకుండా తోటి ఆటగాళ్లలో స్పూర్తి నింపుతూ నాయకుడిగా గిల్ గౌరవం సంపాదించుకున్నాడని గౌతీ చెప్పాడు. 

23 ఏండ్ల కుర్రాడిని టార్గెట్‌‌‌‌ చేయడం సిగ్గుచేటు.. 

ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌కు యంగ్ పేసర్‌‌‌‌‌‌‌‌ హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై మాజీ చీఫ్ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ కె. శ్రీకాంత్ చేసిన విమర్శలకు గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. హెడ్‌‌‌‌ కోచ్ చెప్పిన ప్రతీ మాటకు తలూపడం వల్లనే రాణాను సెలెక్ట్ చేశారని శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్‌‌‌‌లో చెప్పడం అత్యంత సిగ్గుచేటని గౌతీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీ యూట్యూబ్ చానెల్ నడపడం కోసం 23 ఏండ్ల కుర్రాడిని టార్గెట్‌‌‌‌ చేసి విమర్శించడం చాలా అన్యాయం. 

హర్షిత్  తండ్రి సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మనో మాజీ క్రికెటరో లేదా ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐనో కాదు. అతను కేవలం ప్రతిభ ఆధారంగానే జట్టులోకి వచ్చాడు.  భవిష్యత్తులో కూడా అలాగే ఆడతాడు’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. గతంలో శ్రీకాంత్ చీఫ్​సెలెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు అతని కొడుకు అనిరుద్ధను ఇండియా–ఎ టీమ్‌‌‌‌లోకి తీసుకోవడాన్ని  గంభీర్ పరోక్షంగా విమర్శించాడు.

రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌పై స్పందన

2027 వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆడాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఇద్దరి లెజెండ్స్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వన్డే వరల్డ్‌‌‌‌ కప్ ఇంకా రెండున్నరేళ్ల దూరంలో ఉంది. మనం వర్తమానంలో జీవించడం చాలా ముఖ్యం. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌లో వారి అనుభవం జట్టుకు ఎంతో విలువైంది. ఆ టూర్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరూ పర్సనల్‌‌‌‌గా, టీమ్‌‌గా సక్సెస్‌‌‌‌ సాధించాలని ఆశిస్తున్నాను’ అని గంభీర్ అన్నాడు.